Homeటాప్ స్టోరీస్సినీ క‌ళాకారుల‌పై రాష్ట్రా ప్ర‌భుత్వం వ‌రాల జ‌ల్లు!

సినీ క‌ళాకారుల‌పై రాష్ట్రా ప్ర‌భుత్వం వ‌రాల జ‌ల్లు!

Telangana govrnment good news for Telugu film industry
Telangana govrnment good news for Telugu film industry

తెలంగాణ ప్ర‌భుత్వం సినీ ఇండ‌స్ట్రీలో వుంటున్న క‌ళాకారుల‌పై వ‌రాల జల్లు కురిపించింది. మంగ‌ళ‌వారం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌ల‌తో సినిమాటోగ్ర‌ఫీ మినిస్టర్ త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ప‌లు అంశాల‌పై ఇరువురితో చ‌ర్చించిన ఆయ‌న సినీ క‌ళాకారుల‌పై, ఇండ‌స్ట్రీపై వ‌రాల జ‌ల్లు కురిపించారు.

జూబ్లీహిల్స్‌లోని చిరు నివాసంలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన త‌ల‌సాని భారీగానే వ‌రాలు కురిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శంషాబాద్ స‌మీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థ‌లం కేటాయించ‌డం.
24 క్రాఫ్ట్‌ల‌కు సంబంధించిన క‌ళాకారుల‌కు, టెక్నీషియ‌న్‌ల‌కు నైపుణ్య పెంపున‌కు శిక్ష‌ణా కేంద్రం ఏర్పాటు. చిత్ర‌పురి కాల‌నీలోని కార్మికుల‌కు ఇండ్ల నిర్మాణానికి స‌మీపంలో వున్న 10 ఎక‌రాల్ని కేటాయించ‌డం. క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఏర్పాటు కోసం జూబ్లీహిల్స్‌లో 2 ఎక‌రాల స్థ‌లం కేటాయింపు.

- Advertisement -

ఎఫ్‌డీసీ త‌రుపున సినీ, టీవీ క‌ళాకారుల‌కు గుర్తింపు కార్డుల పంపిణీ, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు సినీ కార్మికుల‌కు కూడా అందేలా స‌వ‌ర‌ణ‌, ఈ ఎస్ ఐ, గ్రూప్ ఇన్సురెన్సులు అమ‌లు చేయుట‌. సినీ అవార్డుల ప్ర‌ధానం, త‌దిత‌ర అంశాల చ‌ర్చ‌. ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం అమ‌లు. అయితే వీటిలోని ప‌లు అంశాల‌పై మ‌రో రెండు వారాల్లో మ‌ళ్లీ చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All