Homeటాప్ స్టోరీస్నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు ?

నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు ?

Telangana elections on november 24 th ?తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వస్తున్న విషయం తెలిసిందే . కాగా తెలంగాణకు మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా నవంబర్ 24న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పలు చర్యలను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది . అయితే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అన్న అనుమానం నిన్న మొన్నటి వరకు ఉండేది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున వాటికంటే ముందుగానే అంటే నవంబర్ 24న తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆమేరకు తేదీలను డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది .

అయితే ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . నవంబర్ లో ఎన్నికలు జరిగితే ఫలితాలు డిసెంబర్ లో రావడం వీలయితే ప్రభుత్వం కూడా డిసెంబర్ 2018 లోనే ఏర్పడటం ఖాయం . మళ్ళీ అధికారం మాదే అంటూ గులాబీ అధినేత కేసీఆర్ అంటుండగా దొరల పాలనకు డిసెంబర్ లో చరమగీతం పాడబోతున్నామని మహాకూటమి నేతలు అంటున్నారు . కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ లు జతకట్టడంతో తెలంగాణ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది . నిన్న మొన్నటి వరకు వార్ వన్ సేడ్ అన్నది మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం .

- Advertisement -

English Title: Telangana elections on november 24 th ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All