Homeటాప్ స్టోరీస్పగతో ఆ పత్రిక పెట్టాడు

పగతో ఆ పత్రిక పెట్టాడు

telangana cm kcr makes a powerful enemy తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పగతో ” విజయ క్రాంతి ” అనే పత్రిక ని పెట్టాడు ప్రముఖ పారిశ్రామిక వేత్త సి ఎల్ రాజాం . తెలంగాణ రాకముందు ఉద్యమం కోసం ” నమస్తే తెలంగాణ ” అనే పత్రిక ని పెట్టాడు అయితే అందులో కొంత వాటాదారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ , దాంతో తెలంగాణ రాష్ట్రం రాగానే సి ఎల్ రాజాం ని తెలంగాణ పత్రిక నుండి బయటకు నెట్టేశాడు . ఇంకేముంది కేసీఆర్ పై అప్పటి నుండి ఆగ్రహంగా ఉన్నాడు సి ఎల్ రాజాం . అప్పటి నుండి మరో పత్రిక పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం పై యుద్ధం చేయాలనీ కంకణం కట్టుకున్నాడు .

కట్ చేస్తే ఇన్నాళ్లకు సి ఎల్ రాజాం కల నెరవేరింది , విజయ క్రాంతి పత్రిక ని నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించాడు . కేసీఆర్ ప్రభుత్వ పాలన సవ్యంగా సాగడం లేదని , తెలంగాణ ఆకాంక్ష నెరవేరడం లేదని భావిస్తున్నాడు ఈ పారిశ్రామిక వేత్త దాంతో ప్రభుత్వం పై నిప్పులు చెరగడమే విజయ క్రాంతి పత్రిక నైజమని తెలుస్తోంది . ఇన్నాళ్లు తెలంగాణలో మీడియా ని మేనేజ్ చేస్తూ వచ్చాడు కేసీఆర్ కానీ విజయ క్రాంతి పత్రిక వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు కేసీఆర్ ప్రభుత్వానికి . అసలే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో విజయ క్రాంతి పత్రిక వల్ల ఇబ్బందే కేసీఆర్ ప్రభుత్వానికి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All