
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్` టీమ్‌కి తెలంగాణ పోలీసుల నుంచి గట్టి షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. పవన్‌కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత నటిస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. పవన్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలన్న దిల్ రాజు కల ఈ మూవీతో నెరవేరుతోంది.
శృతిహాసన్ హీరోయిన్‌గా అతిథి పాత్రలో నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కమ్‌బ్యాక్ మూవీ కావడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట. ఓ ఏరియాలోని మెయిన్ థియేటర్ గ్లాస్ డోర్స్‌ని అభిమానులు పగులు గొట్టుకుని మరీ ట్రైలర్ చూడటానికి వెళ్లిన తీరు, రోనా సెకండ్ వేవ్ `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏప్రిల్ 3న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లాన్‌లకు తెలంగాణ పోలీస్ నుంచి గట్టి షాక్ తగిలింది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ మీటింగ్‌లకు, సమావేశాలకు, పబ్లిక్ ఫంక్షన్‌లకు అనుమతి నిరాకరిస్తూ జీవోని రిలీజ్ చేశారు. దీని కారణంగానే `వకీల్‌సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పోలీసు శాఖ అనుమతి నిరాకరించిందని తెలిసింది.