Homeటాప్ స్టోరీస్తెలంగాణలో షూటింగ్ లకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివే

తెలంగాణలో షూటింగ్ లకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివే

తెలంగాణలో షూటింగ్ లకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివే

తెలంగాణలో షూటింగ్ లకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలివేతెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి చూస్తే కొన్ని నిబంధనలను పోందుపర్చింది. అవి ఒకసారి పరిశీలిస్తే..

- Advertisement -

* నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆరోగ్యానికి నిర్మాతదే పూర్తి బాధ్యత. ఆ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

* వీలైనంత వరకూ షూటింగ్ ను అవుట్ డోర్ లో కాకుండా చూసుకోవాలి. సెట్స్ వేసుకుని ఇండోర్ లోనే జరిగేలా చూసుకోవాలి.

* ప్రస్తుతం ఇచ్చిన అనుమతి కొత్త సినిమాల షూటింగ్ లకు కాదు. ఇప్పటికే మొదలై ఆగిపోయిన వాటికి.

* నటీనటులు ఇంటి వద్దనే మేకప్ వేసుకునేలా చూసుకోవాలి. నటీనటులకు కార్ పంపేటప్పుడు దానికి పూర్తిగా శానిటైజ్ చేయాలి.

* షూటింగ్ పోస్ట్ ఎంట్రీ గేట్ వద్దే హ్యాండ్ వాష్, శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలి.

* షూటింగ్ స్పాట్ లో కచ్చితంగా డాక్టర్ ఉండాలి.

* షూటింగ్ స్పాట్ లో 40 మందికి మించి సిబ్బంది ఉండకూడదు.

* హెయిర్ డ్రెస్సేర్, మేకప్ మ్యాన్ లు కచ్చితంగా పీపీఈ కిట్స్ ధరించాలి.

* మేకప్ వేసుకున్న ఆర్టిస్ట్ లు కచ్చితంగా ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలి.

* ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరూ కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి.

* షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫేస్ మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి.

* షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషిద్ధం.

* ప్రతి ఒక్కరూ మెడికల్ డిక్లరేషన్ సమర్పించాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All