
వర్మ `ఐస్‌క్రీమ్` సినిమాతో పాపులర్ అయిన నటి తేజస్వీ మదివాడ. ఆ తరువాత చిన్ని చిన్న పాత్రల్లో మెరిసినా తేజస్వీ తను ఎందుకు ఫేమ్ కాలేకపోయిందో బయటపెట్టి పలువురిని షాక్ కు గురిచేసింది. ఇండస్ట్రీలో తనని బెడ్ రూమ్ వరకు రమ్మన్న వారు చాలా మందే వున్నారంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం కమిట్‌మెంట్ చిత్రంలో నటిస్తూ నెటిజన్స్‌ని హీటెక్కించేస్తోంది. ఈ సినిమా కారణంగా వరుసగా హాట్ కామెంట్స్ చేస్తున్న తేజస్వీ తాజాగా మరోసారి అదే తరహా కామెంట్స్‌తో షాకిస్తోంది.
తన ప్రేమ విషయంలో ఓ హీరోయిన్ భర్త తనకు పోటీగా వస్తున్నారని సంచలన కామెంట్ చేసింది. తేజస్వి చాలా కాలంగా హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ తో స్నేహం చేస్తోంది. తకున్న ఏకైక ఫ్రెండ్ తానే అంటూ బాహాటంగా చెప్పేన తేజస్వీ మదివాడ ఇటీవల తన స్నేహితురాలు అనీషా ఆంబ్రోస్ తల్లి కావడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా అనీషాపై తేజస్వీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చిన్నతనం నుంచి తాను అభిమానించే ఏకైన ఫ్రెండ్ అనీషా ఆంబ్రోస్ ని, ఆమెను ప్రేమించడంలో తనకు ఆమె భర్త పోటీగా వస్తున్నాడని, అయితే ఈ పోటీలో గెలుపు మాత్రం తనదేనని స్పష్టం చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. అనీషా ఆంబ్రోస్ ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తేజస్వీ మదివాడ వెల్లడించిన విషయం తెలిసిందే.