
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన వైఫ్ లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా పరిచయం రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సినీ పరిశ్రమకు అనేక మంది కొత్తవారిని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌ని హీరోగా లాంచ్ చేయబోతున్నారు.
నితిన్ ని తేజ గతంలో తను రూపొందించిన సంచలన చిత్రం `చిత్రం`కు సీక్వెల్ గా చేయబోతున్న `చిత్రం 1.1`తో హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18 న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ఎన్‌టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉంది.
నితిన్ తో పాటు ఈ మూవీ ద్వారా తేజ 100 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మరోసారి తేజతో జతకడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతికి నిపుణులకు సంబఃధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు.