Homeగాసిప్స్మెగాస్టార్ తో మూవీని ప్లాన్ చేస్తున్న తేజ

మెగాస్టార్ తో మూవీని ప్లాన్ చేస్తున్న తేజ

మెగాస్టార్ తో మూవీని ప్లాన్ చేస్తున్న తేజ
మెగాస్టార్ తో మూవీని ప్లాన్ చేస్తున్న తేజ

దర్శకుడిగా తేజది విలక్షణమైన శైలి. తన కెరీర్ లో ఎక్కువగా కొత్త వాళ్ళతోనే సినిమాలు తీసాడు తేజ. కొత్తవాళ్ళతోనే తన కంఫర్ట్ ఉంటుందని, స్టార్స్ ను తాను హ్యాండిల్ చేయలేనని చెబుతుంటాడు తేజ. గతంలో ఇంటర్వ్యూలలో కూడా తాను పవన్, ఎన్టీఆర్ లాంటి వాళ్లతో సినిమాలు చేయలేనని, తనకు స్టార్స్ యొక్క ఇమేజ్ ను హ్యాండిల్ చేయడం రాదని అన్నాడు. అయితే ఇప్పుడు మరి మెగాస్టార్ తో సినిమా మాత్రం ఎలా ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఇక్కడ మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అవును, ప్రస్తుతం అమితాబ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు మన తేజ. ఈయనకి బాలీవుడ్ లో బాగానే పరిచయాలున్నాయి. ఆమిర్ ఖాన్ సినిమాలకు కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు తేజ. అక్కడ టాప్ సినిమాటోగ్రాఫర్ గా ఎదిగే సమయానికి తెలుగులో దర్శకత్వం వహించే ఛాన్స్ రావడంతో మళ్ళీ ఇటు వచ్చేసాడు. ఇప్పటికీ నన్ను బాలీవుడ్ లో గుర్తుపడుతుంటారని చెబుతుంటాడు తేజ.

ఈ పరిచయాలతోనే ఇప్పుడు బాలీవుడ్ సినిమా ప్రయత్నాలు షురూ చేసాడు. అది కూడా ఏకంగా అమితాబ్ తో. ఇటీవలే కశ్మీర్ విషయంలో వివాదాస్పదమైన ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని కథావస్తువుగా చేసుకుని తేజ కథను అల్లుతున్నాడు. ఇప్పటికే బిగ్ బి ను కలిసి కథ చెప్పగా, లైన్ నచ్చిందని, ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే ఆలోచిస్తానని చెప్పాడట. తేజ ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని బేస్ చేసుకుని కథలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరి వారి ప్రయత్నాలు ముందు ఫలిస్తాయో లేక తేజ ప్రయత్నమే ఫలిస్తుందో చూడాలి.

- Advertisement -

దర్శకులలో కొంత మంది ట్రెండ్ సెట్టర్స్ ఉంటారు. అప్పటిదాకా ఒక ధోరణిలో వెళుతోన్న పద్దతిని మార్చేసి కొత్త ట్రెండ్ ను సృష్టిస్తారు. అయితే ఇలాంటి ట్రెండ్ సెట్టర్స్ కూడా వారు సృష్టించిన ట్రెండ్ కే బలైపోతుంటారు. దీనికి సరైన ఉదాహరణగా శ్రీను వైట్ల, తేజ గురించి చెప్పుకోవచ్చు. కామెడీ చిత్రాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించాడు శ్రీను వైట్ల. విలన్ ను బకరా చేసే కాన్సెప్ట్ ను సృష్టించి సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే దాన్నుండి బయటకు రాలేక ఇబ్బందిపడి వరస ప్లాపులు కొనితెచ్చుకున్నాడు. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే అనుకోవచ్చు. ప్రేమకథలలో సరికొత్త ట్రెండ్ కు తెరలేపాడు. అయితే వరసగా రెండు, మూడు సినిమాలు హిట్ అయ్యాక అదే ధోరణిలో సినిమాలు తీస్తూ బోర్ కొట్టించేసాడు. గత దశాబ్ద కాలంలో తేజ నుండి వచ్చిన పాజిటివ్ సినిమా అంటే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకోవచ్చు.

దాని తర్వాత కూడా సీత అనే సినిమా తీసి మరో ప్లాప్ ను అందుకున్నాడు. మరి ఇప్పుడు తేజ ఏకంగా అమితాబ్ తో సినిమా అంటున్నాడు. చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All