
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కన్నీళ్లు పెట్టుకున్నాడు . ఈ సంఘటన నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన దొరసాని ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది . మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన దొరసాని ఈనెల 12న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు . కాగా ఆ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు .
ఈ సందర్బంగా తన తమ్ముడు అని ఏ వేడుకకు రాలేదని , మంచి సినిమా కాబట్టి ప్రమోట్ చేయడానికి వచ్చాను అంటూ , ఆనంద్ కు నా బ్రాండ్ లేకుండానే ఈ సినిమా వచ్చిందని , అమెరికాలో చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి తనని తాను నిరూపించుకోవడానికి ఇక్కడకి వచ్చాడని ఒకదశలో కన్నీళ్లు పెట్టుకున్నాడు . దాంతో దొరసాని వేడుక తీవ్ర ఉద్విగ్నత చోటు చేసుకుంది . ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మంచి స్పీచ్ ఇచ్చి ఆహుతులను ఆకట్టుకున్నాడు .
View this post on Instagram
Witness the world of Dorasaani and Raju! Trailer streaming now. Link in bio.