Homeగాసిప్స్అన్న సినిమాకు తమ్ముడు రావాల్సిందేనా?

అన్న సినిమాకు తమ్ముడు రావాల్సిందేనా?

అన్న సినిమాకు తమ్ముడు రావాల్సిందేనా?
అన్న సినిమాకు తమ్ముడు రావాల్సిందేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మూడు సినిమాల్లో నటించాడు. అందులో ఒకటి హీరోగా కాగా మరో రెండు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎటువంటి ఫలితాన్ని అందుకున్నాయో మనకు తెలుసు. ఇక హీరోగా కళ్యాణ్ రామ్ చేసిన 118 ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా తెరకెక్కుతోన్న ఎంత మంచివాడవురా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం చిత్రాల్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఎంత మంచివాడవురా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే.

ఈసారి సంక్రాంతి బడా సినిమాలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇలాంటి సీజన్ లో కళ్యాణ్ రామ్ చాలా ధైర్యంగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. జనవరి 11న మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. అలాగే రజినీకాంత్ దర్బార్ కూడా సంక్రాంతికే వస్తోంది. ఇలా బడా సినిమాలు లైన్లో ఉన్నా కానీ ధైర్యంగా కళ్యాణ్ రామ్ ముందుకొచ్చాడు.

- Advertisement -

అయితే సినిమా రిలీజ్ డేట్ అయితే ప్రకటించాడు కానీ దీనికి సరైన రీతిలో హైప్ మాత్రం రావడం లేదు. మీడియా ఫోకస్ మొత్తం సంక్రాంతికి వస్తోన్న బడా సినిమాలపైనే ఉండడంతో కనీసం ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా అనుకున్న రేంజ్ లో రావడం లేదు. ఈరోజుల్లో ఎలాంటి సినిమాకైనా పబ్లిసిటీ అనేది చాలా అవసరం. అందుకే కళ్యాణ్ రామ్ ఈ చిత్ర పబ్లిసిటీ కోసం తమ్ముడు తారక్ ను దించబోతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దానికి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ ను తీసుకురావాలని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసాడు. అన్న సినిమా కాబట్టి ఎన్టీఆర్ నో చెబుతాడని అనలేం. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో పడిన తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా బయట ఫంక్షన్ లలో పెద్దగా కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఎంత మంచివాడవురా చిత్రానికి ఎన్టీఆర్ రాక ప్లస్ అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All