Homeటాప్ స్టోరీస్ఆ సినిమా రిలీజ్ వాయిదా పడనుందా

ఆ సినిమా రిలీజ్ వాయిదా పడనుందా

tamilanadu ex cm karunanidhi demise vishwaroopam 2 likely postponeకమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి . తమిళ ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో తమిళనాడు శోకసంద్రం లో మునిగిపోయింది . ఈరోజు కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి , అయినప్పటికీ వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించడంతో ఈనెల 10న విడుదల కావాల్సిన విశ్వరూపం 2 ని వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నాడట కమల్ హాసన్ .

కరుణానిధి అంటే కమల్ కు ఎనలేని గౌరవం , అయినప్పటికీ ఆ పార్టీలో చేరకుండా కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు కమల్ . వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు కూడా . అయితే సినిమా విడుదల ఇంకా రెండు రోజులు కూడా లేదు ఈలోపే కరుణానిధి చనిపోవడంతో తమిళనాట విషాద ఛాయలు నెలకొన్నాయి . ఈ పరిస్థితిలో సినిమా విడుదల చేసి ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే వాయిదా వేయడమే బెటర్ అని భావిస్తున్నాడట . ఈనెల 10 కి బదులుగా ఆగస్టు 15 న విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నాడట కమల్ . అయితే అధికారికంగా కమల్ ప్రకటిస్తేనే కానీ తెలీదు విశ్వరూపం 2 సమయానికి వస్తుందా ? లేదా ? అనేది .

- Advertisement -

English Title: tamilanadu ex cm karunanidhi demise vishwaroopam 2 likely postpone

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All