Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వండి - త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌

షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వండి – త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌

షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వండి - త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌
షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇవ్వండి – త‌మిళ ప్రొడ్యూస‌ర్స్‌

క‌రోనా కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం మొత్తం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాదాపు 50 రోజుల‌కు మించి లాక్‌డౌన్ న‌డుస్తుండ‌టంతో స్కూల్స్‌, కాలేజీలు, సినిమా థియేట‌ర్స్‌, సినిమా షూటింగ్స్ నిర‌వ‌ధికంగా ఆపేశారు. దీంతో చాలా మంఇకి ప‌ని పోయింది. ఉద్యోగాలు పోయాయి. ఈ లాక్‌డౌన్ ఇలాగే కొన‌సాగితే న‌ష్టం భారీగా వుంటుంద‌ని గ్ర‌హించిన త‌మిళ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ముందుగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ల‌కి అనుమ‌తివ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ఒప్పించారు.

- Advertisement -

ఈ నెల 11 నుంచి త‌మిళ ఇండ‌స్ట్రీలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే షూటింగ్‌ల‌కి కూడా అనుమ‌తులు ఇవ్వ‌మ‌ని త‌మిళ ప్రొడ్యూస‌ర్స్ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ కి విజ్ఞప్తి చేస్తూ ఓ విజ్ఞాప‌న ప‌త్రాన్ని అందించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ధ‌నంజ‌య‌న్‌, సురేష్ కామ‌ట్చి, పీఎల్ తేన‌ప్ప‌న్‌, జె.ఎస్‌.కె. స‌తీష్‌, టి. శివ త‌దిత‌రులు పాల్గొని మినిస్ట‌ర్‌కు లేఖ‌ని అంద‌జేశారు.

మంత్రికి అందించిన లేఖ‌లో షూటింగ్‌ల‌కు అనుమ‌తిస్తే 50 శాతం వ‌ర్క‌ర్‌ల‌తో పూర్తి జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్‌లు జ‌రుపుకుంటామ‌ని, కోవిడ్ జాగ్ర‌త్త‌ల్ని పాటిస్తామ‌ని నిర్మాత‌లు మంత్రివి వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. త‌మిళ నిర్మాత‌ల స్ఫూర్తితో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దిస్తారా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts