Homeటాప్ స్టోరీస్ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

Tamil actress Riya Mikka commits suicideహీరోయిన్ రియా మిక్క ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది . తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి రియా మిక్క . అయితే అనూహ్యంగా నిన్న తమిళనాడు లోని వలసర వాక్కం లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది రియా మిక్క . ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆత్మహత్య కు గల కారణాలు తెలుసుకున్నారు . అయితే ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ ఉండాలని కానీ అది ఎక్కడా లభించలేదని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు .

రియా మిక్క గతకొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతోంది . కెరీర్ పట్ల ఏదో ఊహించుకుంది కానీ ఊహలు తల్లకిందులు కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు . అయితే ఆత్మహత్య కోణంలో అలాగే హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రియా మిక్క ఇలా అర్దాంతరంగా చనిపోవడం అందరినీ కలిచి వేస్తోంది .

- Advertisement -

English Title: Tamil actress Riya Mikka commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All