
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో దశాబ్దన్నరగా బిజీ హీరోయిన్ గా చలామణీ అవుతోంది. ఇప్పటికీ అటు యంగ్ హీరోలతో ఇటు సీనియర్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా సీటిమార్, మేస్ట్రో సినిమాల్లో నటించిన తమన్నా ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, ఎఫ్3 చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. వీటితో పాటు రెండు హిందీ చిత్రాలు కూడా అమ్మడి లిస్ట్ లో ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తోందంటూ వార్తలు వస్తోన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయనున్న ప్రాజెక్ట్ కు భోళా శంకర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఈ సినిమాను నవంబర్ 11న లాంచ్ చేయనున్నారు. అలాగే నవంబర్ 15నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తోందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వార్తలు నిజమేనని తమన్నా అడ్వాన్స్ కూడా తీసుకుని అగ్రిమెంట్ సైన్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వస్తుంది. చిరంజీవితో సైరాలో కూడా తమన్నా నటించిన విషయం తెల్సిందే. ఇక భోళా శంకర్ లో కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రను పోషించనుంది.