
మిల్కీ బ్యూటీ తమన్నా గత 15 ఏళ్లుగా తెలుగు సినిమాల్లో రాణిస్తోంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసేసిన తమన్నా ఇప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటోంది. ఇదిలా ఉంటే తమన్నా ఇప్పుడు రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మాస్టర్ చెఫ్ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా చేస్తోంది. ఈ కార్యక్రమ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
ఆగస్ట్ మూడో వారం నుండి ఈ రియాలిటీ షో ను జెమినీ టివిలో ప్రసారం కానుంది. ఈ అనుభవం గురించి మాట్లాడుతూ, “తెలుగు వంటకాలు నా జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఎలా అయితే తెలుగు సినిమా నా జీవితంలో ఒక భాగం అయిందో అలాగే తెలుగు వంటకాలు నా జీవితంలో భాగం అయ్యాయి” అని తెలిపింది.
ప్రస్తుతం తమన్నా తెలుగులో సీటిమార్, మేస్ట్రో చిత్ర విడుదలల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు గుర్తుందా శీతాకాలం, ఎఫ్3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.