Homeటాప్ స్టోరీస్ఫనా, హమ్ తుమ్ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ...

ఫనా, హమ్ తుమ్ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ల ‘నెక్స్ట్ ఏంటి’..!!

Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti!గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ నెక్స్ట్ ఏంటి‘.. బాలీవుడ్ లో ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.. లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని చిత్ర నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు..

నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

- Advertisement -

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: కునాల్ కోహ్లీ
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్ (UK)
డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి
సౌండ్ డిజైన్: దారా సింగ్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల
PRO: వంశీ-శేఖర్
రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్

Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All