Homeన్యూస్మాస్టర్ చెఫ్ మీద లీగల్ పోరాటానికి సిద్ధమైన తమన్నా

మాస్టర్ చెఫ్ మీద లీగల్ పోరాటానికి సిద్ధమైన తమన్నా

మాస్టర్ చెఫ్ మీద లీగల్ పోరాటానికి సిద్ధమైన తమన్నా
మాస్టర్ చెఫ్ మీద లీగల్ పోరాటానికి సిద్ధమైన తమన్నా

తమన్నా తెలుగు కుకింగ్ షో మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. మొదట్లో  డీసెంట్ రేటింగ్స్ సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కన్సిస్టెన్సీ మైంటైన్ చేయడంలో విఫలమైంది. అయితే ఆ కారణమో, మరి డేట్స్ ఇష్యూనో కానీ తమన్నా స్థానాన్ని అనసూయ భర్తీ చేసింది. తమన్నా షో నుండి వెళ్ళిపోయాక జెమినీ టివి వారు ఆమెతో కమ్యూనికేషన్ ను కట్ చేసుకున్నారట.

ఆమెకు ఇవ్వాలని బాకీ మొత్తం ఇంకా రాలేదని, కనీసం తన మ్యానేజర్ ఫోన్ చేస్తుంటే కనీసం ఆన్సర్ చేయట్లేదని తమన్నాకు కోపం వచ్చిందట. ఇక వేరే దారి లేక తమన్నా లీగల్ పోరాటానికి సిద్ధమైందని తెలుస్తోంది. తన లాయర్ చేత జెమినీ టివిపై కేసు ఫైల్ చేయిస్తోంది.

- Advertisement -

కొన్నేళ్ల క్రితమే జెమినీ టివి టాప్ ప్లేస్ ను కోల్పోయింది. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ పరంగా నాలుగో స్థానంలో కొనసాగుతోన్న జెమినీ టివి, మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోస్ ను ప్రారంభించింది. మాస్టర్ చెఫ్ కు తమన్నా హోస్ట్ కాగా ఎవరు మీలో కోటీశ్వరులుకి ఎన్టీఆర్ హోస్ట్. ఈ రెండు షోస్ కూడా మొదట్లో బాగానే వర్కౌట్ అయినా ఆ తర్వాత లో టిఆర్పిలకు పడిపోయాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All