
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. నిజానికి మొదట అందరూ తమన్నాది ఇందులో చాలా చిన్న పాత్ర అనుకున్నారు. మెయిన్ హీరోయిన్ నయనతార అనే భావనే అందరిలోనూ ఉంది. సైరా ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొంటున్నప్పుడు కూడా అందరూ ఇంత చిన్న రోల్ వేసిన తమన్నా ఎందుకు ఇంతలా ప్రమోషన్స్ చేస్తోందని అభిప్రాయపడ్డారు.
కానీ సినిమా చూసి అందరూ షాక్ అయ్యారు. సైరాలో తమన్నాకి చాలా మంచి పాత్ర ఇచ్చారు. నయనతార కన్నా తమన్నాది ఇందులో చాలా ప్రాధాన్యమున్న పాత్ర. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకండ్ హాఫ్ లోనూ తమన్నా కథను మలుపు తిప్పుతుంది. కెరీర్ పరంగా సరైన టైమ్ లో తమన్నాకు ఈ పాత్ర దక్కింది. ప్రేక్షకులు కూడా తమన్నా పాత్ర బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో కచ్చితంగా తమన్నా కెరీర్ మరికొంతకాలం సాగుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికీ తన గ్లామర్ ను మైంటైన్ చేస్తూనే తమన్నా మంచి సినిమాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.