
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి చాల కాలమే అవుతున్న ఇంకా తన హావ నడిపిస్తుంది. కొత్త భామలు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ..తమన్నా మాత్రమే కావాలనే డైరెక్టర్స్ చాలామందే ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్న ఈ బ్యూటీ..సోషల్ మీడియా లోను అంతే యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను కట్టిపడేస్తుంటుంది.
సినిమా తాలూకా విశేషాలతో పాటు పర్శనల్ విషయాలను షేర్ చేస్తూ..అప్పుడప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ అబ్బా అనిపిస్తుంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ తళుకు తళుకు మంటు జిగేల్ అనిపిస్తున్నాయి. ఈ పిక్స్ లలో హాట్ హాట్ కనిపిస్తుండడం తో నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ తో మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కింది. దిల్ రాజు నిర్మిస్తుండగా, దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని డబ్బు డబ్బు అనే సాంగ్ విడుదలై శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది.