Homeటాప్ స్టోరీస్థియేట‌ర్ల రీ ఓపెన్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?

థియేట‌ర్ల రీ ఓపెన్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?

థియేట‌ర్ల రీ ఓపెన్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?
థియేట‌ర్ల రీ ఓపెన్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మేనా?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో సినిమా షూటింగ్‌ల‌తో పాటు సినిమా థియేట‌ర్లు కూడా మూసివేసిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ 4.ఓని ప్రారంభించ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు తెరిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల రీ ఓపెన్ గురించి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు వెంట‌నే తెలిచే ప‌రిస్థితి లేద‌ని, అందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని అది ఒక నెలా.. లేదా రెండు నెల‌ల అనేది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, ఒక వేళ థియేట‌ర్లు తెరిచినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఆస‌క్తి చూప‌ర‌ని, క‌నీసం సీటింగ్‌లో మార్పులు కూడా చేయ‌లేద‌ని అన్నారు.

- Advertisement -

షూటింగ్‌ల విష‌యంలోనూ ఇంకా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని, దీనికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుంద‌ని, సీరియ‌ల్స్ షూటింగ్స్‌కి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతున్నార‌ని, క‌నీస సిబ్బంది లేకుండా ఏదీ సాధ్యం కాద‌ని, న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే వారిలో ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు వున్నాయో లేదో తెలియ‌దు. అందుకే ఇంకొన్ని రోజులు వేచి చూడ‌టం మంచిది` అని త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All