సంప్రదాయ వంటకాలు అందించడానికి ఆహ తో జతకలిసి వియ్యాలవారి విందు సిద్ధమైంది. నేడు సంప్రదాయ వంటకాలు కనుమరుగు అవుతున్న తరుణం లో అందరికి శాస్త్రీయ పద్ధతిలో తినిపించేందుకు జూబ్లీహిల్స్ కావూరీహిల్స్ లో ఆహ తో అల్పాహారం, వియ్యాలవారి విందు శాఖాహారం, మాంసాహారం అందుబాటులోకి తెచ్చింది. ఆదివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో వియ్యాలవారి విందు నిర్వాహకులు అనంత్ చైతన్య, భాను ప్రసాద్, ఆహా రెస్టారెంట్ తరుపున శ్రీకర్ వైట్ల పాల్గొన్నారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ
శాస్త్రీయ పడ్డదిలో ఇక్కడ వంటకాలు రుచి చూశానని ఇవి ఎంతగానో తృప్తినిచ్చాయన్నారు. అలానే హోటల్ మానేజ్ మెంట్ విభాగంలో ఎన్నో జాబ్ అవకాశాలు ఉన్నాయని, వియ్యాలవారి విందు నిర్వాహకులు వారి రెస్టారెంట్స్ లో ఈ డిగ్రీతో ఉన్న యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.
ఆహా రెస్టారెంట్ నిర్వహాకులు శ్రీకర్ వైట్ల మాట్లాడుతూ
ఆహ ద్వారా ప్రజలకు పన్సాకు ఇడ్లీ,దిబ్బరొట్లు,పుల్ల అట్లు మొదలగునవి అందుబలుతులో వుంటాయని ఆగ ఎండి శ్రీకర్ వైట్ల పేర్కొన్నారు.
వియ్యాలవారి విందు ఎండి అనంత్ చైతన్య. భాను ప్రసాద్ మాట్టాడుతూ
రెండు వందల మందికి సరిపడా వాతావరణం లో వియ్యాలవారి విందు శాఖాహారం, మాంసాహారం పల్నాడు పులావ్, అవాక్కయి పులావ్ వంటి వంటకాలు అందుబాటులో ఉన్నాయని వియ్యాలవారి విందు ఎండి అనంత్ చైతన్య , భాను ప్రసాద్ పేర్కొన్నారు.