Homeటాప్ స్టోరీస్పెద్ద హీరోల‌ని కాదంటే అంతేనా?

పెద్ద హీరోల‌ని కాదంటే అంతేనా?

Taapsi sensational comments on big stars
Taapsi sensational comments on big stars

తెలుగులో సినిమాలు త‌గ్గ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది తాప్సీ. అక్క‌డ వ‌రుసగా మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. పింక్‌, బ‌ద్లా వంటి చిత్రాల్లో త‌న‌ది కీల‌క పాత్ర అని, అయినా త‌న‌ని ప్ర‌స్తావించ‌కుండా కేవ‌లం వాట‌ని అమితాబ్ చిత్రాలుగానే ప‌రిగ‌ణిస్తున్నార‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన తాప్సీ తాజాగా స్టార్ హీరోల‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

శ‌భాష్ మిథూ, త‌ప్ప‌డ్‌ వంటి విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న తాప్సీ తాజాగా క‌రీనా క‌పూర్ నిర్వ‌హిస్తున్న ఓ టాక్ షోకి హాజ‌రై పెద్ద హీరోల‌పై సంచల‌న వ్యాఖ్య‌లు చేసింది. క‌రీనా క‌పూర్ షోలో భాగంగా తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా సుర‌క్షిత‌మా ?  ప్ర‌మాద‌మా? అని చెప్పాల‌ని కొన్ని ప్ర‌శ్న‌ల్ని సంధించింది. అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల్నితిర‌స్క‌రించ‌డం సుర‌క్షిత‌మా? లేక ప్ర‌మాద‌మా? అని అడిగిన ప్ర‌శ్న‌కు తాప్సీ ముమ్మాటికీ ప్ర‌మాద‌మే అని చెప్పింది.

- Advertisement -

ఆ త‌రువాత త‌న స‌మాధానానికి వివ‌ర‌ణ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం పెద్ద హీరోల ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే కొన్ని కార‌ణాల వ‌ల్ల తిర‌స్క‌రించాన‌ని, ఆ విష‌యాన్ని వాళ్లు అపార్థం చేసుకుంటార‌ని తెలిసి వెళ్లి త‌ను ఎందుకు తిర‌స్క‌రించానో వెల్ల‌డించాన‌ని, త‌న కార‌ణం న‌చ్చ‌డంతో వారు కూడా ఆ విష‌యాన్ని పాజిటివ్‌గా తీసుకున్నార‌ని వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All