Homeటాప్ స్టోరీస్షారుఖ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తాప్సి

షారుఖ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తాప్సి

షారుఖ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తాప్సి
షారుఖ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తాప్సి

సౌత్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన తాప్సి, బాలీవుడ్ వెళ్ళాక మాత్రం తన కెరీర్ ను పూర్తిగా మార్చేసుకుంది. ఎక్కువగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటూ ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ఆమె పలు ప్రతిష్టాత్మక బయోపిక్స్ లో కూడా భాగం కానుంది.

ఇదిలా ఉంటే తాప్సి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. పఠాన్ చిత్రాన్ని చేస్తోన్న షారుఖ్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటినుండో చర్చల దశలో ఉండగా మొత్తానికి ఫైనలైజ్ కాబోతోంది.

- Advertisement -

ఈ సినిమాలో హీరోయిన్ గా తాప్సిను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాప్సి టాప్ నటిగా మారడం ఖాయం. పఠాన్ పూర్తయ్యాక రాజ్ కుమారి హిరానీ – షారుఖ్ సినిమా మొదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All