
అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హీరోయిన్ తాప్సీ . తాప్సీ కి సందీప్ రెడ్డి పై ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ? నిజమైన ప్రేమ ఉన్నవాళ్లు తన పార్ట్ నర్ ని కొడతారు , అనుమతి లేకుండానే చేతులు వేస్తారు అదే నిజమైన ప్రేమ అని సరికొత్త నిర్వచనం ఇవ్వడమే !
తాజాగా నాగ్ పూర్ లో ఓ మోడల్ ని అనుమానించిన ఆమె ప్రియుడు ఆ మోడల్ ని దారుణంగా చంపాడు . ఒకవేళ అతడు ఆ మోడల్ ని నిజంగా ప్రేమించి ఉంటే ఇలా చేస్తాడా ? ఇదేనా నిజమైన ప్రేమ అంటూ పరోక్షంగా సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు చేసింది తాప్సీ పన్ను . నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది కానీ బలవంతం కాదని చెప్పడం తన ఉద్దశం అని అంటోంది తాప్సీ . అయితే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉంది కాబట్టి ఎవరి వ్యూస్ వాళ్ళు చేప్పేస్తున్నారు .