Homeటాప్ స్టోరీస్సె* కామెడీ సినిమాపై తాప్సి హాట్ కామెంట్స్

సె* కామెడీ సినిమాపై తాప్సి హాట్ కామెంట్స్

Taapsee Pannu comments on glamour comedy movies
Taapsee Pannu comments on glamour comedy movies

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన ముద్దగుమ్మలు చాలా వరకు సక్సెస్ అవుతారని తాప్సి కుడా నిరూపించింది. ఝుమ్మంది నాధం సినిమాతో అప్పుడెప్పుడో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఫైనల్ గా బాలీవుడ్ కి వెళ్లి క్లిక్కయినా అమ్మడు ఒక ఫార్ములా ప్రకారం సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ డోస్ ఎంత పెంచినా పాత్రలో మ్యాటర్ ఉంటేనే తాప్సి కథలకు అంగీకరిస్తోంది. పింక్ సినిమా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్లు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. అన్ని తరహా జానర్స్ లో సినిమాలు చేయడానికి సిద్ధమే అని చెప్పిన తాప్సి సె* కామెడీ చిత్రాలకు మాత్రం అస్సలు ఒప్పుకోనంటోంది. మహిళలను కించపరిచేలా కుళ్లు జోకులు ఉండే సె* కామెడీ జానర్స్ ని టచ్ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని అంటోంది.
అలాగే తన జీవితంలో ఎప్పుడు కూడా ఐటెమ్ సాంగ్ చేయనని తాప్సి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది. కథానాయికగా నటించే సినిమాలో గ్లామర్ ప్రజెంటేషన్ ఎంత పెరిగినా ఇబ్బందిపడను, ఎలాంటి సాంగ్స్ అయినా నో చెప్పను కానీ వేరే సినిమాల్లో ఐటెమ్ సాంగ్ మాత్రం చేయనని సొట్ట బుగ్గల సుందరి గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ చేయాల్సి వస్తే.. ఆ కథలో అది చాలా కీలకమైంది ఉండాలని తాప్సి తన కెరీర్ ప్రణాళికల గురించి తెలిపింది. బాలీవుడ్ లో వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దక్కుతుండడంతో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంటున్న తాప్సి మళ్ళీ తెలుగు తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All