Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్తెలుగు సినిమాలపై మళ్ళీ మాట మార్చిన తాప్సి

తెలుగు సినిమాలపై మళ్ళీ మాట మార్చిన తాప్సి

తెలుగు సినిమాలపై మళ్ళీ మాట మార్చిన తాప్సి
తెలుగు సినిమాలపై మళ్ళీ మాట మార్చిన తాప్సి

మనకి నార్త్ భామలంటే మోజు. తెలుగులో ఎంత టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నా కానీ మనం మాత్రం నార్త్ భామలవైపే చూస్తాం. వారు మాత్రం ఇక్కడ సినిమాలు చేస్తారు. ఇక్కడ ఎలాంటి పాత్రలిచ్చినా మొదట్లో నోరు మెదపరు. గ్లామర్ షోకు సైతం ఎస్ అంటారు. కానీ కొంచెం ఫేమ్ వచ్చి బాలీవుడ్ అవకాశాలు వస్తే ఇక్కడి సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు.

- Advertisement -

ఈ కోవలోకి వస్తారు ఇలియానా, తాప్సి లాంటి భామలు. ఇక్కడ చేసినంత కాలం కేవలం గ్లామర్ పాత్రలు చేసి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న వీరు బాలీవుడ్ కు వెళ్లి తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. తాప్సి అయితే సౌత్ వాళ్లకు నడుము మీద అంత మోజు ఎందుకో, కొబ్బరి కాయలు కూడా విసురుతారు అంటూ రాఘవేంద్ర రావు పైనే సెటైర్ వేసింది.

అయితే సందర్భం దొరికినప్పుడల్లా తెలుగు సినిమాలను కించపరిచే అలవాటున్న తాప్సి ఈసారి మాత్రం ప్లేట్ తిప్పేసింది. వేరే వాళ్ళ మాటలు నమ్మి తాను సినిమాల ఎంపికలో తప్పులు చేసానని, అందువల్లే తెలుగులో ఒకలాంటి సినిమాలకి పరిమితమైపోయానని అంది. అయితే ఈ తప్పుల వల్ల తాను పాఠాలు నేర్చుకున్నట్లు తాప్సి కవర్ చేసుకుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts