
హమ్మయ్య ఎట్టకేలకు సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది . దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం సైరా నరసింహారెడ్డి . మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఈ సైరా నరసింహారెడ్డి . సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ షూటింగ్ స్టార్ట్ కాగా నిన్నటితో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది దాంతో గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర బృందం .
రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు , అనుష్క , విజయ్ సేతుపతి , సుదీప్ , నిహారిక , తమన్నా , తదితరులు నటిస్తున్నారు . ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న విడుదల చేయనున్నారు . అయితే ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్బంగా ట్రైలర్ ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం . భారీ అంచనాలున్న సైరా నరసింహారెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అన్న విషయం తెలిసిందే .