Homeటాప్ స్టోరీస్100 కోట్ల క్లబ్ లో చేరిన సైరా

100 కోట్ల క్లబ్ లో చేరిన సైరా

syeraa joins 100 crore club
syeraa joins 100 crore club

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి పండగ సీజన్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా కానీ 100 కోట్ల క్లబ్ లో చేరడానికి 6 రోజులు పట్టింది. తెలుగులో కలెక్షన్స్ బాగున్నా మిగతా భాషలలో వేరే చిత్రాల నుండి పోటీ ఉండడంతో సైరా నష్టపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో వార్, జోకర్ సినిమాలు సైరా సినిమాను గట్టి దెబ్బ తీశాయి.

దాని మూలంగా సైరా అక్కడ నామమాత్రపు కలెక్షన్స్ మాత్రమే సాధించగలిగింది. అమితాబ్ వంటి స్టార్ నటుడు ఉన్నా కానీ అక్కడ ఏం చేయలేకపోయాడు. ఏదైతేనేం, సైరా ఇప్పటివరకూ 104 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే దాదాపు 76 కోట్ల రూపాయలు వచ్చాయి. మిగతా అన్ని ప్రాంతాల నుండి 28 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈరోజు పండగ కావడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది.

- Advertisement -

ఈరోజుతో పండగ అయిపోవడంతో సైరా రేపటినుండి ఎలా పెర్ఫర్మ్ చేస్తుందన్న దానిమీద చిత్ర ఫలితం ఆధారపడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హిట్ దిశగా వెళుతున్న సైరా, మిగిలిన ప్రాంతాల్లో ప్లాప్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All