Homeగాసిప్స్చిరు సినిమాపై ఆ రూమర్లలో నిజమెంత?

చిరు సినిమాపై ఆ రూమర్లలో నిజమెంత?

syeraa buyers to be benefited with megastar 152 project
syeraa buyers to be benefited with megastar 152 project

మెగాస్టార్ చిరంజీవి తన పదేళ్ల కలని సైరా నరసింహారెడ్డి రూపంలో నెరవేర్చాడు కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి ప్రేమపై మక్కువ మార్కెట్ కు ఎంత స్కోప్ ఉంది, ఎంతవరకు బిజినెస్ చేయొచ్చు అంటూ వ్యాపార లెక్కలు వేయకుండా చేతికి ఎముక లేని చందంగా ఖర్చుపెట్టేసాడు. దర్శకుడు ఏది అడిగితే అది సమకూర్చి దాదాపు 200 కోట్లు పెట్టి సైరాను తెరకెక్కించాడు రామ్ చరణ్.

తీరా సినిమాను మార్కెట్ చేసే విషయంలో ఘోరంగా విఫలమై చతికిలపడ్డారు. కంటెంట్ పరంగా సైరాను తీసి పడేయడానికి లేదు. బాహుబలి రేంజ్ లో ఫైట్స్ డిజైన్ చేసాడు సురేందర్ రెడ్డి. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలకు కూడా లోటు లేదు. అయితే పోటీగా వేరే భాషల్లో సినిమాలు విడుదల కావడం సైరాకు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా హిందీలో వార్ విడుదలై 300 కోట్లు కొల్లగొట్టి సైరాను సైడ్ చేసేసింది.

దాంతో హిందీలో ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. మిగతా భాషల్లో సినిమా ప్లాప్ అయినా తెలుగులో అయినా హిట్ అవుతుందనుకున్నారు. మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్, పాట్రియాటిక్ ఫీల్ వెరసి సైరా ఒక అద్భుతమైన ఫీల్ ను అయితే తీసుకొచ్చింది కానీ తెలుగులో ఈ సినిమా సేఫ్ వెంచర్ అవ్వలేకపోయింది నైజాం, సీడెడ్ లో తప్పితే ఈ సినిమా అన్ని చోట్లా దాదాపు 25 శాతానికి మించి నష్టపోయినట్లు తెలుస్తోంది.

నైజాంలో 30 కోట్లకు పైగా సైరా షేర్ తెచ్చుకుని సేఫ్ వెంచర్ అనిపించుకుంది. సీడెడ్ లో దాదాపు 18 కోట్ల దాకా వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ ను అందుకుంది. అయితే మార్కెట్ కన్నా ఎక్కువ బిజినెస్ చేయడంతో వసూలు చేయడం కష్టమైంది. తాజా సమాచారం ప్రకారం సైరా కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లకు మెగాస్టార్ 152వ సినిమాతో న్యాయం చేయబోతున్నారట.

- Advertisement -

నిజానికి ఈ పద్దతి ఇప్పటిది కాదు, ఎప్పటినుండో ఉన్నదే. ఒక సినిమా పోతే, ఆ తర్వాతి సినిమాకు తక్కువ రేట్లకు హక్కులు కట్టబెట్టడమో లేక ప్లాప్ అయ్యాక కొంత భర్తీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే సైరాతో తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని రామ్ చరణ్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దాంతో సైరాను కొని నష్టపోయిన బయ్యర్లకు సహాయపడాలని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులను సైరా సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకే కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. దానికి తోడు కొరటాల శివ – చిరంజీవి సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి బయ్యర్లకు లాభాలు వచ్చేలా హక్కులను అమ్మాలని ప్లాన్ చేసారు. బయ్యర్ల బాగోగుల కోసం ఇంతలా ఆలోచిస్తాడు కాబట్టే మెగాస్టార్ అయ్యాడు అని అతని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All