
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా హైలైట్స్ బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన రైల్వే స్టేషన్ సెట్లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారు.
ఈ సినిమా హైలైట్స్ లో ఈ సీన్ ఒకటిగా ఉంటుందని అంటున్నారు.ఈ సీన్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. మరోపక్క సినిమాలోని ఒక్కో సాంగ్ ను విడుదల చేస్తూ సినిమా ఫై మరింత అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల కాగా , ఉగాది కానుకగా మూడో సాంగ్ రాబోతుంది.
- Advertisement -