Homeటాప్ స్టోరీస్సుస్మా స్వరాజ్ హఠాన్మరణం

సుస్మా స్వరాజ్ హఠాన్మరణం

Sushma Swaraj
Sushma Swaraj

కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్(67) హఠాన్మరణంతో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి . ఢిల్లీ ముఖ్యమంత్రిగా , కేంద్ర మంత్రిగా పలురకాల పదవులను అలంకరించిన సుస్మా స్వరాజ్ తనదైన ముద్ర వేసింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుస్మా స్వరాజ్ నిన్న రాత్రి 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు .

తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన సుస్మా స్వరాజ్ హఠాన్మరణం తో రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి . అసలే ఆర్టికల్ 370 రద్దు పై రగడ జరుగుతున్న సమయంలో సుస్మా స్వరాజ్ ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే చనిపోవడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు బీజేపీ శ్రేణులు . నిన్న రాత్రి 9 గంటల సమయంలో సుస్మా కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు . అయితే డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది . సుస్మా స్వరాజ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి , ప్రధాని , ఇతర రాజకీయ పార్టీల నేతలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All