Homeటాప్ స్టోరీస్మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్న సూర్య?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్న సూర్య?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్న సూర్య?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్న సూర్య?

తమిళ నటుడు సూర్య టాలీవుడ్ ఎంట్రీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో సూర్య పనిచేయనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇదిలా ఉంటే సూర్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా పనిచేస్తాడని అంటున్నారు.

త్రివిక్రమ్ తో సూర్య సినిమా అంటూ గత కొన్ని రోజుల నుండి అటు తమిళ మీడియా ఇటు తెలుగు మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా మీద ఫోకస్ పెట్టాడు త్రివిక్రమ్. ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివరి నుండి మొదలవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ఆ సినిమా పూర్తవ్వగానే సూర్య సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా మరి బోయపాటి శ్రీనుతో సూర్య సినిమాను పూర్తి చేస్తాడని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు కచ్చితంగా పడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All