Homeటాప్ స్టోరీస్70 కోట్ల అప్పు ఉండడం వల్లే ఇలా అంటున్న సూర్య

70 కోట్ల అప్పు ఉండడం వల్లే ఇలా అంటున్న సూర్య

70 కోట్ల అప్పు ఉండడం వల్లే ఇలా అంటున్న సూర్య
70 కోట్ల అప్పు ఉండడం వల్లే ఇలా అంటున్న సూర్య

సూర్య నిర్మాతగా మారి తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నిర్మించిన సినిమా పోంమగళ్ వండాల్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైపోయి రిలీజ్ కు సిద్ధమవగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో సూర్య డేర్ చేసి సినిమాను డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేస్తున్నాడు. జూన్ 29న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

అయితే మొదట డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అన్నప్పుడు తమిళ డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా స్పందించారు. ఈ చర్యను ఖండిస్తున్నామని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సూర్య కనుక డైరెక్ట్ రిలీజ్ చేస్తే తన సినిమాలను బాయ్ కాట్ చేస్తామని ఎవరం కొనుగోలు చేయమని తెలిపారు. అయితే సూర్య వెనక్కి తగ్గలేదు. తన సినిమాను తన ఇష్టం వచ్చినట్లు రిలీజ్ చేసుకుంటానని తేల్చి చెప్పాడు.

- Advertisement -

నాకు 70 కోట్ల అప్పు ఉంది. ఇంకేం చేయమంటారు? నా సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకున్నారా? నా సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఓవర్ ఫ్లోస్ నమోదైనప్పుడు నిజాయితీగా తిరిగి నిర్మాతకు డబ్బులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడా? ఇకపై కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే చేసుకుంటా అని ఖరాఖండీగా చెప్పేసాడు.

సూర్య చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All