Homeటాప్ స్టోరీస్గొప్ప మ‌న‌సు చాటుకున్న స్టార్ హీరో!

గొప్ప మ‌న‌సు చాటుకున్న స్టార్ హీరో!

Surya proves once again his kind heart
Surya proves once again his kind heart

తెర‌పైన హీరోలు చాలా వ‌ర‌కు తెర వెనుక కూడా హీరోలుగానే ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఆప‌ద‌ల్లో వున్న‌వారిని ఆదుకుంటుంటారు. త‌మిళ హీరో సూర్య తెర ముందే కాదు తెర వెనుక కూడా తాను హీరోనే అని నిరూపించి గొప్ప మ‌న‌సుని చాటుకున్నారు. గ‌త కొంత కాలంగా సూర్య ఫ్యామిలీ అగ‌ర‌మ్ ఫౌండేష‌న్ పేరుతో విద్యా సంస్థ‌ల్ని న‌డుపుతూ చ‌దువుకోలేని పిల్ల‌ల‌కు, ఆర్థికంగా వెన‌క‌బ‌డి చ‌దువుకు దూర‌మ‌వుతున్న వారికి ఆప‌న్న హ‌స్తాన్ని అందిస్తూ అండ‌గా నిలుస్తోంది.

ఇటీవ‌ల చెన్నైలో అగ‌ర‌మ్ ఫౌండేష‌న్‌కు సంబంధించిన ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో సూర్య కూడా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ అమ్మాయి త‌న తండ్రి క్యాన్స‌ర్ భారిన ప‌డి చ‌నిపోవ‌డంతో డైలీ లేబ‌ర్‌గా ప‌నిచేసే త‌ల్లిపై ఆధార‌ప‌డి చ‌దువుకుంటోంది. ఇలా చ‌దువుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, చ‌దువు మానేస్తాన‌ని చాలా సార్లు చెప్పింద‌ట‌. తాజాగా అదే అమ్మాయి ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్‌లో డిగ్రీ పట్టాని పొంది ఓ ఆర్గ‌నైజేష‌న్‌లో ఉద్యోగాన్ని పొంద‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌.

- Advertisement -

ఈ విష‌యం విన్న సూర్య స్టేజ్‌పై నుంచి కింద‌కి వ‌చ్చి స‌ద‌రు అమ్మాయి ద‌గ్గ‌రికి వెళ్లి అభినందించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండాల‌న్న‌ట్టు సూర్య ప్ర‌వ‌ర్థించిన తీకుకు అక్క‌డున్న వారంతా ఫిదా అయ్యార‌ట‌. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరో సూర్య ప్ర‌స్తుతం ఏయిర్ డెక్క‌న్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న `సూరారై పోట్రు` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే హ‌ద్దురా` పేరుతో మేలో రిలీజ్ చేయ‌బోతున్నారు. `గురు` ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గునీత్ మోంగాతో క‌లిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All