Homeటాప్ స్టోరీస్సూర్య 'ఈటీ' ట్రైలర్ విడుదల

సూర్య ‘ఈటీ’ ట్రైలర్ విడుదల

ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..ఇప్పుడు ఈటీ మూవీ తో మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు.

- Advertisement -

‘వాడేమో సైంటిస్ట్ కావాలని ఆశ పడ్డాడు.. వేరే విధంగా అవ్వాలని నేను ఆశ పడ్డాను.. కానీ కాలం దైవం వాడ్ని ఇలా చూడాలని ఆశ పడ్డాయి’ అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఇది పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ లో సత్యరాజ్ , సూరి , జయప్రకాశ్ , శరణ్య పొన్వన్నన్ , వినయ్ రాయ్ , సుబ్బు పంచు , దేవదర్శిని , ఎం.ఎస్ భాస్కర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూర్య కు ఈ మూవీ ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All