Homeటాప్ స్టోరీస్సూర్య ఆకాశం నీ హద్దురా హిందీలోకి...

సూర్య ఆకాశం నీ హద్దురా హిందీలోకి…

సూర్య ఆకాశం నీ హద్దురా హిందీలోకి...
సూర్య ఆకాశం నీ హద్దురా హిందీలోకి…

ఒక భాషలో బాగా పేరు తెచ్చుకున్న సినిమాలు మరో భాషలో రీమేక్ కావడం అనేది ఎప్పటినుండో వస్తున్నదే. ఈ మధ్య కాలంలో ఈ రీమేక్ ల హవా బాగా పెరిగింది. తెలుగు భాషలోకి కొన్ని చిత్రాలు రీమేక్ అవుతుండగా తెలుగు నుండి కూడా చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సౌత్ నుండి మరో చిత్రం హిందీలోకి రీమేక్ అవుతోంది.

సూర్య హీరోగా వచ్చిన సూరరై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బాగా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెల్సిందే. భారతదేశంలో అతి తక్కువ ధరతో ఫ్లైట్స్ నడపాలన్న గోపినాథ్ ఆలోచన ఎలా కార్యరూపం దాల్చింది అన్నది ఈ చిత్ర కథాంశం.

- Advertisement -

ఇక ఈ సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతోంది. సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ తో పాటు విక్రమ్ మల్హోత్రా అబుందటియా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించనుంది. ప్రస్తుతం దర్శకురాలు సుధా కొంగర స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ ను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All