Homeటాప్ స్టోరీస్2020 తెరపైకి వస్తున్ననాలుగో “సింగం”

2020 తెరపైకి వస్తున్ననాలుగో “సింగం”

Suriyas next movie is Singham 4
Suriyas next movie is Singham 4

సినిమా బాషలో ప్రస్తుతం తెలుగులో సింహం అంటే బాలయ్య బాబు & తమిళంలో సింగం అంటే సూర్య అన్నట్లు మారిపోయింది. అడవి కి రాజైన సింహం క్యారెక్టర్ ని ఒక మెటాఫర్ గా వీళ్ళు వాడినట్లు, ఇంకెవరూ వాడలేదు. అప్పట్లో ఒక్కసారి మాత్రం సాయి కుమార్ గారు “కనిపించని నాలుగో సింహమే పోలీస్” అని పోలీస్ స్టోరీ లో చించేశారు.

ఇప్పుడు తమిళ్ హీరో సూర్య 2020 లో మరోసారి “సింగం” ఫ్రాంచైజీ ని బయటకు తీస్తున్నారు. అస్సలు సింగం 1; 2;3 సీరిస్ లలో సూర్య నటన, డైరెక్టర్ హరి సార్ టేకింగ్, సింగం.. సింగం… అంటూ మన దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్నిటికీ మించి డైరెక్ట్ గా పాల సముద్రం నుండి దిగినట్లు ఉండే అనుష్క, ఇలా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్నమాట. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ తో సిట్టింగ్స్ మొదలెట్టేసారు మన హరి సర్. ఇమాన్ అంటే ఎవరో కాదు, “దండనక” సాంగ్ తో తమిళనాడు ని ఊపేసిన గ్రేట్ పర్సన్. ఇక 2019 లో N.G.K, కాప్పాన్ సినిమాలు ఏవీ సూర్యకు సరైన హిట్ ఇవ్వలేదు. ఇక ఆ కసి అంతా సింగం లో చూపించి, ఫ్యాన్స్ కి అసలు సిసలు మాస్ మీటర్ సినిమా చూపించడానికి ఫిక్స్ అయిపోయారు సింగం బ్యాచ్.

- Advertisement -

ఈ సినిమా మళ్ళీ మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోపెట్ట్టి, థ్రిల్ చెయ్యాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All