Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్తీవ్ర ఉద్రిక్తత : సూర్య కటౌట్ కూల్చివేత

తీవ్ర ఉద్రిక్తత : సూర్య కటౌట్ కూల్చివేత

- Advertisement -

స్టార్ హీరో సూర్య భారీ కటౌట్ కూల్చివేతలో తమిళనాడు లోని తిరుత్తణి లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సూర్య నటించిన ” ఎన్ జి కే ” చిత్రం విడుదల అవుతుండటంతో ప్రపంచంలోనే పెద్దదైన కటౌట్ ని ఏర్పాటు చేసారు తిరుత్తణి లోని సూర్య అభిమానులు . 215 అడుగుల ఎత్తు ఉన్న ఈ కటౌట్ ని అనుమతి లేదని పైగా రోడ్డు పక్కనే ఉందనే కారణంతో అధికారులు సూర్య కటౌట్ ని తొలగించారు .

7 లక్షల వ్యయంతో భారీ కటౌట్ ని ఏర్పాటు చేస్తే ఇలా సినిమా రిలీజ్ రోజున కటౌట్ ని తొలగించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు తిరుత్తణి లో గలాటకు దిగారు కూడా . ఫ్యాన్స్ హడావుడి ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు . పోలీసులు సూర్య అభిమానులపై లాఠీ ఛార్జ్ చేయడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts