Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్10 లక్షల విరాళం ఇచ్చిన సూర్య- కార్తీ

10 లక్షల విరాళం ఇచ్చిన సూర్య- కార్తీ

Suriya and Karthi Donates 10 lakhs for Kerala floods
Suriya and Karthi Donates 10 lakhs for Kerala floods

తమిళ స్టార్ హీరోలు సూర్య – కార్తీ లు కేరళ వరద బాధితుల సహాయార్థం  10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

- Advertisement -

విరాళాన్ని ప్రకటించడమే కాకుండా తక్షణమే ఆ సొమ్ము ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసారు కూడా. ఎప్పుడు విపత్తులు వచ్చినా తక్షణం స్పందించి సహాయం అందిస్తుంటారు ఈ తమిళ బ్రదర్స్.

ఇప్పటికే పలుమార్లు తెలుగు రాష్ట్రాల్లో వరదలు  వచ్చినా , కేరళలో వరదలు వచ్చినా , అలాగే తమిళనాట వరదలు వచ్చినా స్పందిస్తూ తక్షణ సహాయం అందిస్తున్నారు.
అంతేకాదు పలువురు అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు , దీనికోసం ఓ ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేసారు ఈ హీరో బ్రదర్స్. సూర్య , కార్తీ లకు గతకొంత కాలంగా సరైన హిట్స్ లేవు , చేస్తున్న సినిమాలు పరాజయం పొందుతూనే ఉన్నాయి.
తెలుగులో కూడా ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది కానీ వరుస ప్లాప్ లతో మార్కెట్ డీలా పడింది ఈ ఇద్దరు హీరోలకు.
ఇక అన్నాదమ్ములు సాలిడ్ హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts