Homeటాప్ స్టోరీస్మహేష్, బన్నీ ఉండగా ఆ రిస్క్ ఎందుకు అంటున్నాడు సురేష్ బాబు

మహేష్, బన్నీ ఉండగా ఆ రిస్క్ ఎందుకు అంటున్నాడు సురేష్ బాబు

suresh babu reveals sankranthi is not in their plans
suresh babu reveals sankranthi is not in their plans

ఒక రెండు నెలలు వెనక్కి వెళ్లి ఒకసారి గుర్తుచేసుకుంటే అల వైకుంఠపురములో టీమ్ సడెన్ గా తమ సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు జనవరి 12న విడుదల అవుతున్నట్లు పేర్కొంది. అది జరిగిన గంటకు సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా తమ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఇలా రెండు సినిమాలు సడెన్ గా ఒకరితో ఒకరు చర్చించుకోకుండా రిలీజ్ డేట్లు ప్రకటించడం వెనుక వెంకీ మామ ఉన్న విషయం తెల్సిందే. అప్పుడు వెంకీ మామ సినిమా సంక్రాంతికి వస్తుందన్న ప్రచారం జరిగింది. ఇద్దరు పేరున్న హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలో, అందులోనూ ఫ్యామిలీ సినిమా కావడంతో, తమ సినిమా వస్తోందంటే వెంకీ మామ వెనక్కి తగ్గుతుందన్న ఉద్దేశంతో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు తమ సినిమాలను సంక్రాంతికి షెడ్యూల్ చేసుకున్నాయి. దాంతో వెంకీ మామ రిలీజ్ పై మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. చివరికి ఒక వారం క్రితం ఈ సినిమా డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.

ఇక కట్ చేస్తే ఇప్పుడు సురేష్ బాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అసలు సంక్రాంతి రిలీజ్ అన్నది తమ దృష్టిలోనే లేదని, ఏనాడూ తాము సంక్రాంతికి వద్దామన్న డిస్కషన్ కూడా పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడు సురేష్ బాబు. ముందు దసరాకు వద్దామనుకున్నాం. వెంకటేష్ కాలు బెణకడంతో కుదర్లేదు. తర్వాత దీపావళి అనుకున్నాం, రాశి ఖన్నా డేట్లు అడ్జస్ట్ కాక అది కూడా తప్పింది. ఇక మా ముందున్న రిలీజ్ డేట్లు క్రిస్మస్ మరియు డిసెంబర్ 13. మధ్యలో డిసెంబర్ 25కి వద్దామా అని బలంగా ఆలోచించాం కానీ అన్ని విధాలుగా డిసెంబర్ 13 అయితేనే బెటర్ అనిపించింది. రెండు వారాలు థియేటర్లను హోల్డ్ చేసుకుంటే పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవచ్చని, సినిమాకు లాంగ్ రన్ కుదిరితే సంక్రాంతి సీజన్ వరకూ తిరుగుండదని సురేష్ బాబు అభిప్రయపడ్డాడు. అయినా మహేష్, అల్లు అర్జున్ వస్తోంటే మా సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తాం అంటూ సంక్రాంతి అసలు తమ ఆలోచనలోనే లేదని చెప్పే ప్రయత్నం మరోసారి చేసాడు.

- Advertisement -

వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. వెంకీ, చైతూ ఈ సినిమాలో మామ అల్లుళ్లుగా కనిపించడం విశేషం. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై సరైన అంచనాలను నెలకొల్పింది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా అన్ని రకాల ఎమోషన్స్ ను మిక్స్ చేసి ఈ కథ రూపొందించినట్లు దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఆర్మీ మేజర్ గా కనిపించనున్న విషయం తెల్సిందే. ఈ మిలిటరీ ఎపిసోడ్ 40 నిమిషాల పాటు ఉంటుందని, ఆ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నాడు దర్శకుడు. మరి చూడాలి నిజంగానే బాబీ చెప్పినట్లు ఇవే హైలైట్ అయ్యి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All