Homeటాప్ స్టోరీస్అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే

అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే

Suresh babu reveals fact behind road accidentఅగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొద్దిరోజుల కిందట కార్ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే . అయితే ఆ కారు యాక్సిడెంట్ లో ముగ్గురికి గాయాలు కాగా అప్పుడో పెద్ద చర్చ అయ్యింది . దగ్గుబాటి సురేష్ బాబు మద్యం తాగి కారు డ్రైవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి వాటికీ ఇప్పుడు వివరణ ఇస్తున్నాడు ఈ నిర్మాత అంతేకాదు అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో వివరించి చెబుతున్నాడు . అసలు యాక్సిడెంట్ జరిగిన రోజున సురేష్ బాబు కొంపల్లి లో ఓ ఫంక్షన్ కు హాజరు కావాల్సి ఉందట అయితే ఆ ఫంక్షన్ దూరం లో జరుగుతోంది కాబట్టి అక్కడికి వెళ్లకుండా అత్తాపూర్ లో ఓ థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తూ కూర్చున్నాడట . సరిగ్గా అదే సమయంలో కొంపల్లి నుండి ఫ్రెండ్ ఫోన్ చేయడంతో చేసేదిలేక సినిమా హాల్లోంచి ఫంక్షన్ కు వెళ్ళాడట !

ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రాత్రి కావడంతో పాటు కారు టైర్ పేలడంతో అదుపుతప్పి స్కూటీ ని గుద్దడం జరిగింది . ఆ యాక్సిడెంట్ లో ముగ్గురికి గాయాలు అయ్యాయి అయితే ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించి అన్ని ఖర్చులు నేనే భరిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ బాబు . అయితే ఫంక్షన్ కు వెళ్లాల్సిన నేను సినిమాకు వెళ్లడం ఏంటి ? యాక్సిడెంట్ చేయడం ఏంటి ? అంతా ఖర్మ …… తలరాత అని అంటున్నాడు సురేష్ బాబు .

- Advertisement -

English Title: Suresh babu reveals fact behind road accident

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All