Homeటాప్ స్టోరీస్ఓటిటి డీల్స్ తో దూసుకుపోతోన్న సురేష్ బాబు

ఓటిటి డీల్స్ తో దూసుకుపోతోన్న సురేష్ బాబు

ఓటిటి డీల్స్ తో దూసుకుపోతోన్న సురేష్ బాబు
ఓటిటి డీల్స్ తో దూసుకుపోతోన్న సురేష్ బాబు

అగ్ర నిర్మాత సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ నిర్మాత. సెంటిమెంట్ కంటే పరిస్థితులకు విలువనిచ్చే వ్యక్తి. ప్రస్తుతం సురేష్ రెండు సినిమాలను సహానిర్మించాడు. ఈ రెండు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమాలే కావడం విశేషం. తమిళ అసురన్ ను తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేసాడు అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 ను కూడా రీమేక్ చేసాడు.

ఈ రెండు చిత్రాల షూటింగ్స్ పూర్తై విడుదల కోసం వేచి చూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సురేష్ బాబు ఈ రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి డీల్స్ క్లోజ్ చేసాడు. నారప్ప చిత్రం వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దృశ్యం 2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలవుతుంది. ఈ రెండు చిత్రాల ద్వారా సురేష్ బాబు దాదాపు 70 కోట్ల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక సురేష్ బాబు నిర్మించిన విరాటపర్వం చిత్ర డీల్ నెట్ ఫ్లిక్స్ తో ఫైనలైజ్ చేయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All