Homeటాప్ స్టోరీస్ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై మరింత క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై మరింత క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై మరింత క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై మరింత క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. చేసేవి తక్కువ సినిమాలే అయినా ఖచ్చితత్వంతో బరిలోకి దిగడం సురేష్ బాబు నైజం. ఆ కథ బాగుంటుంది అనిపిస్తేనే, దానిపై కాన్ఫిడెన్స్ వస్తేనే ముందుకెళుతుంటాడు. దర్శకుడు ఎంత పెద్ద వాడైనా కథ దగ్గర రాజి పాడడం సురేష్ బాబుకు అలవాటు లేదు. కథపై ఉన్న సందేహాలను ప్రతి పాయింట్ ను దర్శకుడిని అడిగి క్లియర్ గా తెలుసుకుంటాడు. అందుకే సురేష్ బాబుతో పని చేయడం చాలా కష్టమని ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ ఉంది. అయితే ఒక్కసారి క్లారిటీ వచ్చాక మళ్ళీ అటువైపు తిరిగి చూడడు. అందుకే సురేష్ బాబు జడ్జ్మెంట్ పై అంత గురి. తన బ్యానర్ లో ఫెయిల్ అయిన సినిమాలు చాలా తక్కువ. తాను నిర్మించకుండా, చిత్రీకరణ పూర్తైన తర్వాత కొన్న సినిమాలకు కూడా ఇదే పద్దతి ఫాలో అవుతుంటాడు ఈ బడా నిర్మాత.

తాజాగా వెంకీ మామ సినిమాను నిర్మించాడు. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా తెరక్కించగా, మొదటి రోజు అదిరిపోయే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ఈ క్రమంలో థియేటర్ మార్కెట్ ను తినేస్తోందని అందరూ అభిప్రాయపడుతున్న ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై తన అభిప్రాయాలను తెలిపాడు. అసలు ఇండస్ట్రీలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్ ఫామ్స్ కు వ్యతిరేకంగా గళమెత్తింది సురేష్ బాబే. నిర్మాతలు ముందువెనకా చూసుకోకుండా విడుదలైన 30 రోజులకే సినిమాను స్ట్రీమ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని, అది థియేటర్ బిజినెస్ మొత్తాన్ని తినేస్తుందని, అసలు ప్రేక్షకుడు థియేటర్ కు రావడమే మానేసే ప్రమాదముందని రెండేళ్ల క్రితమే హెచ్చరించాడు సురేష్ బాబు.

- Advertisement -

అయితే వెంకీ మామ టైటిల్స్ లో ప్రైమ్ అని కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన సురేష్ బాబు ఇప్పుడు వాటికే హక్కులు కట్టబెట్టడాన్ని ఏ రకంగా చూడాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై వివరణ ఇచ్చాడు. నిజమే ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను తినేస్తాయి, అలా అని అవి ఉండకూడదని అర్ధం కాదు. వాటిని ఎప్పుడు విడుదల చేయాలో తెలుసుకోవాలి. మంచి సినిమా తీస్తే థియేటర్ కు రాకుండా ప్రేక్షకుడిని ఎవరూ అడ్డుకోలేరు అంటాడు సురేష్ బాబు. అదే పేలవమైన సినిమా తీస్తే థియేటర్ లోనే కాదు ప్రైమ్ వంటి వాటిలో కూడా ఆడదు అంటున్నాడు.

అందుకే నిర్మాతలకు ఇచ్చే సలహా కంటెంట్ విషయంలో రాజీ పడకండి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే థియేటర్ లో సినిమా అదే ఆడుతుంది అంటున్నాడు. నిర్మాత పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిని ఒద్దనుకోవడం కరెక్ట్ కాదని చెబుతున్నాడు. ముందు ముందు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ మరింత పెరుగుతాయి. యాపిల్ సైతం ఈ విపణిలోకి వస్తోంది. మొత్తానికి సురేష్ బాబు చెప్పొచ్చేది ఏంటంటే మంచి సినిమాలు తీయాలి, దాన్ని బిజినెస్ చేసుకోవడం తెలిసుండాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All