
దర్శకుడిగా సురేందర్ రెడ్డి సినీ ప్రయాణం చాలా భిన్నమైనది. దర్శకుడిగా అతని టేస్ట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే నిలకడ లేని తనంతో టాప్ లీగ్ లోకి వెళ్లే ప్రతిభ కలిగిన సురేందర్ రెడ్డి ఇన్నాళ్లు వెనకాల ఉండిపోయాడు. అయితే ఒక్క సైరా సినిమాతో లెక్కలన్నీ మారిపోయాయి. ఈ చిత్రానికి ముందు ఒక హిట్ వస్తే, ఒక ప్లాప్ పలకరించేది.
దాంతో కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లకుండా ఉండిపోయేది. కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో సురేందర్ రెడ్డి కచ్చితంగా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు. నిజానికి సైరా సురేందర్ చేతికి వచ్చినప్పుడు పెదవి విరిచిన వాళ్ళే ఎక్కువ.
ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని సురేందర్ హ్యాండిల్ చేయలేడేమోనని సందేహించిన వాళ్ళే ఎక్కువ. సైరా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. వేరే భాషల నుండి ఎంపిక చేసుకున్న భారీ తారాగణం, వి ఎఫ్ ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఇలా సైరా బాహుబలికి ఏ మాత్రం తీసిపోని రేంజ్ సినిమా. సైరాను సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేసిన విధానానికి ప్రేక్షకులతో పాటు విశ్లేషకులు కూడా ఫిదా అయ్యారు.