
ప్రతి శుక్రవారం సినీ ప్రియులకు పండగ రోజు అలాగే ఫిలిం మేకర్స్ కి మాత్రం ఏ సినిమా ఎలాంటి ఫలితాలని ఇస్తుంది అనే టెన్షన్ ఉంటుంది.ఈ ఫిబ్రవరి 18 న రిలీజ్ ఐన అన్ని సినిమాల్లో “సురభి 70 ఎం ఎం” ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకొని మంచి కలక్షన్స్ తో దూసుకుపోతుంది .
కొత్త నటీనటులతో గంగాధర వై కె దర్శకత్వం లో వచ్చిన ఈ “సురభి 70 ఎం ఎం” సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తూ ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాలకి బిన్నంగా ఉండడం తో సినీ అభిమానులు ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు .
సంధ్య 70 ఎం ఎం తో పాటు నలభై థియేటర్స్ లో రిలీజ్ ఐన సురభి 70 ఎం ఎం సినిమా రోజు రోజుకి థియేటర్స్ ని పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది .బాబీ ఫిలిమ్స్ బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా కి కె కె చైతన్య నిర్మాతగా ఉన్నారు , ఉషాంజలి ,వినోద్ , అనిల్ , అక్షిత , యోగి , అనీష్ రామ్ , మల్లికార్జున , చంద్రకాంత్ , మహేష్ వై ,కళ్యాణ్ శాస్త్రి తదితరులు నటించిన సురభి 70 ఎం ఎం సినిమా విజయవంతం కావడం తో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకి , మీడియా వారికీ అభినందనలు తెలుపుతున్నారు .