
సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. టీజర్ తో సినిమాపై సూపర్ క్రేజ్ తెప్పించిన పరశురాం ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ స్కాం ల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మహేష్ స్టైల్, యాక్షన్ అదిరిపోతాయని తెలుస్తుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ లో మహేష్ డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తాడని టాక్.
విలన్ సముద్రఖనికి మహేష్ వరాహావతారంలో కనిపిస్తారట. ఇప్పటివరకు మహేష్ పౌరాణిక పాత్రలు చేయలేదు. యువరాజు సినిమాలో ఒక సాంగ్ లో కృష్ణుడిగా కనిపించాడు అంతే. మరి వరాహావతారంలో మహేష్ ఎలా ఉంటాడో అని ఫ్యాన్స్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది.
మంచి కంటెంట్ తో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పరశురాం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.