Homeటాప్ స్టోరీస్ఏప్రిల్ 1న సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ వెనక్కి తగ్గాడబ్బా..!

ఏప్రిల్ 1న సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ వెనక్కి తగ్గాడబ్బా..!

Superstar Mahesh Sarkaru Vari Pata New Release Date
 

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. అసలైతే 2022 సంక్రాంతి రేసులో మహేష్ సినిమా ఉండాల్సింది కాని ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటుగా పవన్ భీంలా నాయక్ కూడా జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాల మధ్య పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో కాని సర్కారు వారి పాట సినిమాను 2022 ఏప్రిల్ 1న రిలీజ్ అంటూ చిత్రయూనిట్ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది.

స్టార్ సినిమాలన్ని ఒకేసారి వస్తే బాక్సాఫీస్ కళకళలాడుతుంది కానీ ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. అందుకే పోటీకి వచ్చే సినిమాల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సంక్రాంతికి రావాలని అనుకున్న మహేష్ సర్కారు వారి పాట ఏకంగా సమ్మర్ టార్గెట్ తో వస్తుంది. ఏప్రిల్ 1న సింగిల్ గా వచ్చి సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు మహేష్.

- Advertisement -

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పోకిరి లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సాంగ్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All