మహేష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్

0
135
మహేష్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే ,  సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో  నిన్న సాయంత్రం టీజర్ ని విడుదల చేసారు . మహేష్ డైలాగ్స్ , విజువల్స్ కి క్షణాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . ఇక యు ట్యూబ్ లో అయితే మహేష్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది ,  అసలే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇక దానికి తగ్గట్లుగా కొరటాల శివ కూడా తోడవడంతో టీజర్ దుమ్ము రేపుతోంది .
ఇంతకుముందు మహేష్ – కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సంచలన విజయం సాధించడంతో భరత్ అనే నేను పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా నిన్న రిలీజ్ అయిన టీజర్ ఉండటంతో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది . మహేష్ బాబు సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య అత్యంత ప్రతిస్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .