Homeటాప్ స్టోరీస్బ్లాక్ బస్టర్ దిశగా సంజు

బ్లాక్ బస్టర్ దిశగా సంజు

super possitive reports on sanju బాలీవుడ్ లో బయోపిక్ లకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే పలు బయోపిక్ లు సంచలన విజయాలు సాధించగా తాజాగా ” సంజు ” బయోపిక్ కూడా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయ్యింది సంజు చిత్రం . సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ట్రైలర్ విడుదల అయ్యాక ఆ అంచనాలు మరింతగా పెరిగాయి . దాంతో సంజు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూసారు .

కట్ చేస్తే ఆ రోజు రానే వచ్చింది , ఈరోజు సంజు బయోపిక్ విడుదల అయ్యింది . భారీ అంచనాలు ఉండటంతో భారీ ఓపెనింగ్స్ దక్కే ఛాన్స్ ఉంది . ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుండే పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో సంజు బయోపిక్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . రణబీర్ కపూర్ , సోనమ్ కపూర్ , అనుష్క , మనీషా కొయిరాలా , పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో నటించిన సంజు చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు . సంజయ్ దత్ కు రాజ్ కుమార్ హిరానీ ప్రాణస్నేహితుడు కావడంతో సంజు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడుతున్నారు . మొత్తానికి కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ సంజు మాత్రం ఈ ఏడాది బాలీవుడ్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు .

- Advertisement -

English Title: super possitive reports on sanju

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All