
సన్నీలియోన్.. ఒకప్పుడు పోర్న్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పేరిది. హీటెక్కించే అందంతో అలరారిన సన్నీ లియోనర్ గురించి తెలియని వారుండరు. అలాంటి సన్నీ ఆ తరువాత పాత జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టి బాలీవుడ్ తెరపై కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. బిగ్‌బాస్‌తో ఇండియా బాట పట్టిన సన్ని `జిస్మ్ 2 `తో బాలీవుడ్‌లో పాపులర్ అయింది.
ఆ క్రేజ్‌తో సన్నీకి ఇతర భాషల్లోనూ ఆఫర్లు రావడం తెలిసిందే. తెలుగులోనూ మంచు మనోజ్ `కరెంట్‌తీగ`, డా. రాజశేఖర్ నటించిన పీఎస్‌వీ గరుడ వేగ వంటి చిత్రాల్లోనూ ప్రత్యేక గీతాల్లో మెరిసింది. తన అంద చందాలతో మెస్మరైజ్ చేస్తున్న సన్నీకి సోషల్ మీడియా ఇన్ స్టాలో 40 మిలియన్‌లకు మించి ఫాలోవర్స్ వున్నారు. నిత్యం ఏదో ఒక హాట్ పిక్, వీడియోతో తన ఫ్యాన్స్‌ని రంజింపజేస్తోంది సన్నీ.
కరోనా కారణంగా ముంబైని వీడి లాస్ ఏంజీల్స్‌కి మకాం మార్చేసిన సన్నీ తాజాగా ఓ హాటెస్ట్ పిక్‌ని తన అభిమానులతో పంచుకుంది. బ్లాక్ స్విమ్ సూట్ తరహా డ్రెస్‌లో హాట్ హాట్ అందాలని కను విందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హీటు పుట్టించేస్తోంది. గత ఏడాది నేపాలీ చిత్రం `పాస్‌వర్డ్`లో స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసిన సన్నీ ఈ ఏడాది బంగ్లాదేశ్ చిత్రంలోనూ నటిస్తోంది.